సదరన్ రీ క్యాంప్ లో వసతులు లేక వికలాంగుల ఇక్కట్లు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

సదరన్ రీ క్యాంప్ లో వసతులు లేక వికలాంగుల ఇక్కట్లు
అల్పాహారం ఏర్పాటు చేసిన పాత్రికేయ సంఘాలు
వికలాంగులను పరామర్శించి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో వికలాంగుల సర్టిఫికెట్ల పునః పరిశీలన కోసం ఏర్పాటు చేసిన సదరన్ కేంద్రంలో వసతులు లేక వికలాంగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.గురు,శుక్ర,శనివారాలల్లో నిర్వహించనున్న ఈ సదరన్ రీ క్యాంపులల్లో రోజుకి 60 మంది చొప్పున వికలాంగుల వారి అని సర్టిఫికెట్లను పరిశీలించి వారి అంగవైకల్యం ఎంత శాతం ఉన్నది అని డాక్టర్ నిర్ధారించి మరల సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ప్రభుత్వం ఈ సదరన్ క్యాంపు లను ఏర్పాటు చేసింది.గురువారం ఈ క్యాంపుకు వచ్చిన డాక్టర్ ఆలస్యంగా రావడంతో సాయంత్రం వరకు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నామని పలువురు వికలాంగులు పాత్రికేయులకు తెలిపారు.శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకి వికలాంగులను ప్రభుత్వ వైద్యశాలకు రమ్మన్న 10 గంటల నుండి 11 గంటల మధ్యలో మాత్రమే డాక్టర్ రావటంతో వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేవలం టెంట్ వేశారని,విరిగిపోయిన కుర్చీలు వేశారని,మంచి నీళ్లు తప్ప ఏమీ ఏర్పాట్లు లేవని వికలాంగులమైన తాము వైద్యశాల మెట్లు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నామని,తమకు కనీసం ఏ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలో చెప్పేందుకు కూడా ఎవరు లేరని వికలాంగులు ప్రసాద్,వి కనకలక్ష్మి లు వాపోయారు.ప్రభుత్వం వికలాంగుల సర్టిఫికెట్లను ఇంటి వద్ద పరిశీలించి వారికి అర్హత ఉందో లేదో నిర్ధారించుకుంటే తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కావని,వైద్యశాలకు రమ్మని గంటల తరబడి కూర్చోబెట్టడంతో షుగర్ పేషెంట్లు ఇతర సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ఊళ్లో వారు తమ ఇళ్లకు వెళ్లి భోజనం చేసి వచ్చిన బయట నుంచి వచ్చిన వారు కనీసం అల్పాహారం కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించారు.వికలాంగుల రీ వైద్య అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన కోసం వేరే ఊళ్ళ నుంచి డాక్టర్లను కేటాయించడంతో వారు రావడం ఆలస్యం కావడం తో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.
అల్పాహారం ఏర్పాటుచేసిన పాత్రికేయ సంఘాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మూర్తి,ఏపియంపిఏ జిల్లా పిఆర్ఓ మెటికల శ్రీనివాసరావు లు వికలాంగులు పడుతున్న ఇబ్బందులను గమనించిన జగ్గయ్యపేటలోని పాత్రికేయ సంఘాలు దివ్యాంగులకు మధ్యాహ్నం అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు.
దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్
విషయం తెలిసి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ప్రభుత్వ వైద్యశాలకు విచ్చేయగా దివ్యాంగులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. వారి సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ దివ్యాంగులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. పరిశీలనకు వచ్చిన వైద్యులతో సంప్రదించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తగిన ఏర్పాట్లు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
What's Your Reaction?






