మన చేతి లో ఇటువంటి గుర్తు ఉందా..? దీని అర్ధం వింటే మీరు షాక్ అవ్వాల్సిందే..!
స్టూడియో భారత్ ప్రతినిధి
మన చేతి లో ఇటువంటి గుర్తు ఉందా..? దీని అర్ధం వింటే మీరు షాక్ అవ్వాల్సిందే..!
ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది.భవిష్యత్ ల్లో ఎవరు ఏ స్థానంలో ఉంటారో? ఉద్యోగం,పెండ్లి,జీవితంలో స్థిర పడడం లాంటి విషయాలను తెలుసు కోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
ఇటువంటి విషయంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.అయితే జ్యోతిష్య శాస్త్రంలో చాలా రకాల పద్ధతులు కూడా ఉన్నాయి.వీటిలో హస్త సాముద్రికము శాస్త్రం ఒకటి. హస్త సాముద్రికము అనగా అరచేతిలో ఉండే రేఖల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు.ఇటువంటి హస్తసాముద్రికంను విశ్వసించేవారు చాలా మందే ఉన్నారు. వారిలో సాధారణ ప్రజలే కాకుండా ప్రముఖులు కూడా ఉన్నారు.
మన అర చేతిలో గీతాలు రక రకాలుగా ఉంటాయి.వీటితో పాటు చేతిలో గుర్తులు కూడా ఉంటాయి.అయితే అర చేతిలో రేఖల మధ్య ‘ఎక్స్’ (X) ఆకారంలో గుర్తు ఉంటే వారికి లైఫ్ లో తిరుగు ఉండదంటున్నారు హస్త సాముద్రికం వారు. ఇటువంటి గుర్తు ప్రపంచం మొత్తంలో 5 శాతం మందికి మాత్రమే ఉంటుందట.అర చేతిలో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉండడం వల్ల కలిగే ఫలితాల గురించి హస్త సాముద్రిక శాస్త్రం వారు ఏమి చెప్పుతున్నారంటే..
మన అర చేతిలో ఎక్స్ గుర్తు ఉన్న వారు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట.అటువంటి వ్యక్తి సక్సెస్ బాటలో నడవడమే కాక ఇతరులను కూడా ఆ మార్గంలో నడిపిస్తారట.ఈ గుర్తు కలిగిన వ్యక్తులు ప్రపంచాన్ని కూడా జయిస్తారని సైంటిస్టులు చెబుతున్నారు.ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అర చేతిలో ఈ ఎక్స్ గుర్తు ఉండేదట. అదేవిధంగ అలెగ్జాండర్ తన అరచేతి రేఖలను బలంగా నమ్మేవారంట.మాస్కో లో ఉండే హెచ్.టీ.ఐ యూనివర్సిటి సైంటిస్టులు చాలా మంది చేతి రేఖల పై పరిశోధనలు చేశారు.
అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ కు,రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కు అర చేతిలో ఎక్స్ గుర్తు ఉండేదని సైంటిస్టులు తెలియజేశారు.పరిశోధనల ప్రకారం రెండు అర చేతుల్లో ఎక్స్ గుర్తు ఉంటే వారు జీనియస్ అని,బలవంతులుగా ఉండడంతోపాటు,ఇతర వ్యక్తులను తేలికగా అంచనా వేయగలరట.అలాగే వీరిని మోసం చేయడం చాలా కష్టం.ఎక్స్ గుర్తు ఉన్నవారు శారీరకంగా,మానసికంగా శక్తివంతులుగా ఉంటారట.ఈ వ్యక్తులు పేరు ప్రతిష్టలు, సమాజంలో చాలా గౌరవం ఉంటుందని సదరు పరిశోధకులు చెబుతున్నారు.
What's Your Reaction?