కామాక్షీ అమ్మవారికి వెండి కవచాని,వెండి చెవులను విరాళంగా అందజేశారు
ముక్తేశ్వరపురం స్టూడియో భారత్ ప్రతినిధి
కామాక్షీ అమ్మవారికి వెండి కవచాని,వెండి చెవులను విరాళంగా అందజేశారు
ముక్తేశ్వరపురం
జగ్గయ్యపేట మండలం ముక్తేశ్వరపురం(ముక్త్యాల) గ్రామం కోటి లింగ హరహర క్షేత్రంలో వేంచేసియున్న పంచముఖ అమృత లింగేశ్వర స్వామి కామాక్షీ అమ్మవారికి వెండి కవచాని,వెండి చెవులను తుడి వెంకటమ్మ గారి జ్ఞాపకార్థం అందించారు.గణపతి పూజ,రుద్రహోమం యాగం,స్వామి వారికి అభిషేకం అనంతరం తెలంగాణ రాష్ట్రం,వనపర్తి జిల్లా మంగళంపల్లి వాస్తవ్యులు తుడి శ్రీనివాసరావు వారి సతీమణి సాహితి చేతులు మీదుగా వెండి కవచాని,వెండి చెవులను సమర్పించారు.
పూజా అనంతరం కామాక్షీ దేవి అమ్మవారికి దాతలు,భక్తుల సమక్షంలో వెండి కవచాని,వెండి చెవులను అలంకరించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం,వనపర్తి జిల్లా మంగళంపల్లి వాస్తవ్యులు తుడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముక్త్యాల కోటిలింగ హరహర క్షేత్రంలో వేంచేసియున్న పంచముఖ అమృత లింగేశ్వర స్వామి, కామాక్షీ అమ్మవారు విశిష్టతను మరియు ఎక్కడ లేని విధంగా లింగ ప్రతిష్ట చేయడం గొప్పతనాన్ని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీహర్ష శర్మ, మణికంఠ శ్రీనివాస్ శర్మ,చల్లపల్లి అవినాష్ శర్మ పాల్గొన్నారు.
What's Your Reaction?