ప్రజాస్వామ్యంలో ధర్మం ఎటు
స్టూడియో భారత్ ప్రతినిధి
భారత దేశ చరిత్రలో వందల,వేల సంవత్సరాల రాజరికాలు,పరపాలనలు(ఇతరుల పాలనలో) అంతమైన సంగతి అందరికి తెలిసిందే.ఈ సమయంలో నాయకత్వం నిరంకుశత్వం తద్వారా ప్రజలను పీడించి ఇబ్బందులు పడ్డ సంగతి చరిత్రలు చెప్పుతున్నాయి.ఇటువంటి సమాజంలో ప్రజారంజకంగా పాలించిన వారు వేళ్ళ మీద భారతావనిలో ఉన్నారనే చెప్పుకోవచ్చు.అటువంటి కాలాని చరిత్ర తుదముట్టించిదనే చెప్పవచ్చు.
భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు గత 77 సంవత్సరాల కాలం నుండి ఏర్పడిన సంగతి అందరికి తెలిసిన విషయమే.నూతన ప్రజాస్వామ్యంలో భారతావనిలో ప్రజలకు కొన్ని సంవత్సరాల పాటు మంచి ఫలితాలే అందాయి.కాని నేటి భారతావనిలో సేవాభావంలో ఉన్న రాజకీయం ఒక్క పెట్టుబడిగా మారి పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.దీనితో ప్రజా ధనం, ప్రకృతి సంపదలను కాపాడి ముందు తరాలకు ఆదర్శంగా నిలబడాల్సింది పోయి,వాటి దుర్వినియోగం పాలౌతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
దీనితో నాయకులకు తరాలు తరగని సంపాదన,ప్రజాస్వామ్యంలో మాత్రం పాలన వల్ల పెరుగుతున్న అప్పులు,తరాలకు తరగని సహజ సంపదను కొల్లగొట్టడంతో ప్రజలకు అప్పులు,ప్రకృతి ప్రకోపాలు మిగిలాయి.మానవులు ఈ భూమి మీద ఎంత సంపాదించిన,ఎన్ని రాజ్యాలు గెలిచిన హిట్లర్ చరిత్ర చదివితే అందరికి అర్థం అవుతుంది.తుదికంట తీసుకొని పోయ్యేది ఏమి లేదని అందరికి తెలిసిన విషయమే.కీర్తి ప్రతిష్టలు మనం సమాజంలో చేసే ధర్మా,అధర్మాల పై ఆధారపడుతుంది.మన భారతావనిలో శత్రువుని సైతం ప్రేమించాలనే ఉంది.కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ప్రజారంజకంగా పాలించి,సహజ సంపదను కాపాడి ధర్మాన్ని కాపాడి తరువాత తరానికి ఆదర్శంగా నిలబడాల్సి ఉంది.ధర్మో రక్షీతి రక్షితః ....
ఇది ఎవ్వరిని ఉద్దేశించింది కాదు ..... ఇది అందరు ధర్మం పాటించడం కోసం మాత్రమే..మీ సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు....
What's Your Reaction?