అంబానీని చంపేస్తాం కలకలం రేపుతోన్న ఈమెయిల్
ముంబాయి స్టూడియో భారత్ ప్రతినిధి
రూ.20 కోట్లు ఇవ్వకపోతే అంబానీని చంపేస్తాం.. కలకలం రేపుతోన్న ఈమెయిల్
ముంబయి:
రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani)ని చంపుతామని ఓ బెదిరింపు మెయిల్ రావడం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ముకేష్ అంబానీకి చెందిన ఓ మెయిల్‌కి(Gmail) నిన్న గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్ పంపాడు.అందులో"మీరు రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం.భారత్‌లో అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారు" అని ఉంది. అప్రమత్తమైన అంబానీ భద్రతా అధికారులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.షాబాద్ ఖాన్ అనే వ్యక్తి ఈ బెదిరింపు ఈమెయిల్ పంపినట్లు పోలీసులు తెలిపారు.
ముంబయిలోని గామ్‌దేవి పోలీసులు నిందితుడిపై ఐపీసీ 387,506 (2)సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అంబానీ,అతని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపు కాల్స్ చేసినందుకు బిహార్‌కు చెందిన మరొకరిని ముంబయి పోలీసులు గతేడాది అరెస్టు చేశారు.దక్షిణ ముంబయి(Mumbai)లోని అంబానీ కుటుంబ నివాసం 'యాంటిలియా'తో పాటు హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ను పేల్చేస్తామని అతను బెదిరించాడు.2021లో యాంటిలియా వెలుపల 20 పేలుడు జెలిటిన్ స్టిక్స్, బెదిరింపు లేఖతో కూడిన స్కార్పియో కారు పట్టుబడింది.ఆ లేఖలో "యే సిర్ఫ్ ట్రైలర్ హై" అని రాసి ఉంది.ఇలా వరుస బెదిరింపు ఘటనలతో అంబానీ భద్రతా దళ సిబ్బంది అప్రమత్తమయ్యారు..
What's Your Reaction?