తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

బ్రేకింగ్ న్యూస్... వానియంబాడి స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 11, 2023 - 18:48
 0  41
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడు:

తమిళనాడులోని తిరువత్తూర్ జిల్లా వానియంబాడి హైవేపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలిసింది.అతివేగంగా వచ్చిన రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం..

ఈ దుర్ఘటనలో ఐదుగురు స్పాట్‌ లో చనిపోగా..60 మంది గాయాల పాలయ్యారు.అయితే గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రమాదం జరగడంతో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి ప్రమాద స్థలికి చేరుకున్నారు.

గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు.చనిపోయిన వారి మృత దేహాలను మార్చురీకి పంపించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

శనివారం తెల్లవారుజామున తమిళనాడులోని తిరువత్తూర్ జిల్లా వానియంబాడి హైవేపై రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి.ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా..60 మంది తీవ్రంగా గాయపడ్డారు.వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు వెల్లడించారు.మూల మలుపు వద్ద రెండు బస్సులు అతి వేగంతో వెళ్లగా ఎదురెదురుగా ఢీకొన్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనలో 2 బస్సుల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు.బస్సుల్లో ఇరుక్కుపోయి మరో ముగ్గురు ప్రయాణికులు చనిపోయారని పోలీసులు తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow