సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 11, 2023 - 18:11
 0  98
సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

హైదరాబాద్:

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 

సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 9.45 గంటలకు హృద్రోగంతో కన్నుమూశారు.

చంద్రమోహన్ వయసు 82 ఏళ్ళు.ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.సోమవారం హైదరాబాద్‌ లోనే చంద్రమోహన్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

హీరోగా,హాస్య నటుడిగా,క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో ఆయన వెండితెరపై వెలిగారు.తెలుగులో ఒకప్పుడు గొప్ప హీరోయిన్లు వెలిగిన వారందరూ తొలుత చంద్రమోహన్‌ సరసన నటించిన వారే.

ఆయన పక్కన హీరోయిన్‌గా నటిస్తే తిరుగు ఉండదనే భావన చాలా మంది హీరోయిన్లలో ఉంది.అది నిజం కూడా.జయసుధ,జయప్రద మొదలు సుహాసిని వరకు అందరూ తొలినాళ్లలో ఆయన సరసన నటించినవారే.

1942 మే 23న కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించారు చంద్రమోహన్‌.ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్.932 పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్‌..1966లో రంగులరాట్నం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. 

ఎన్నో విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రజల మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు...

చంద్రమోహన్ కి పలువురు సంతాపం...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow