ఏ రోజు ఏ బతకమ్మ పండుగ తెలుసా?

స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 14, 2023 - 20:17
Oct 14, 2023 - 20:39
 0  49
ఏ రోజు ఏ బతకమ్మ పండుగ తెలుసా?

ఏ రోజు ఏ బతకమ్మ పండుగ తెలుసా..?

ఒక్క తెలంగాణాకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలతో సమాంతరంగా తెలంగాణా మహిళలు జరుపుకునే బతుకమ్మ పండుగ పూర్తి విశేషాలు "రంగురంగుల అందంగా పేర్చిన బతుకమ్మలు, అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి పాడే ఉయ్యాల పాటలు,వివిధ రకాల పదార్థాలతో రుచికరంగా తయారు చేసే నైవేద్యాలు..వెరసి తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేవే బతుకమ్మ పండుగ సంబరాలు,అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.మహిళలెంతగానో ముచ్చటపడి ఆడే బతుకమ్మను వారు రోజుకో పేరుతో పిలుస్తూ,తీరొక్క న్కెవేద్యంతో కాలుస్తారు.మరి ఆ పేర్లేంటో,ఆయా రోజుల్లో అమ్మకు న్కైవేద్యంగా సమర్పించే పదార్థాలేంటో మనము తెలుసుకుందాం రండి..

ఎంగిలిపూల బతుకమ్మ

Studiobharat

బతుకమ్మ పండుగ భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది.దీన్ని తెలంగాణలో పెత్ర అమావాస్య అని కూడా పిలుస్తారు.ఈ రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడడం సంప్రదాయం. అయితే ఇలా తొలిరోజున పేర్చిన బతుకమ్మను 'బతుకమ్మ'గా పేర్కొంటారు. అలాగే ఈ రోజున అమ్మకు తులసి ఆకులు, వక్కలు న్కెవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన తర్వాత మహిళలు ఈ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు.ఇలా తొలి రోజు బతుకమ్మ పూర్తవుతుంది.

అటుకుల బతుకమ్మ 

Studiobharat

ఆశ్వయుజ మాసంలో తొలి రోజ్కెన పాడ్యమి నాడు జరుపుకొనే బతుకమ్మను 'అటుకుల బతుకమ్మ' అని పిలుస్తారు.ఈ రోజున అమ్మకు ఎంతో ఇష్టమైన చప్పిడిపప్పు,బెల్లం,అటుకులు..వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. 

ముద్దపప్పు బతుకమ్మ

Studiobharat

బతుకమ్మ ఆటలో మూడో రోజ్మెన విదియ నాడు అమ్మను 'ముద్దపప్పు బతుకమ్మ'గా కొలుస్తారు.మహిళలంతా ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు.. మొదల్కెన పదార్థాలను అమ్మకు నివేదన చేస్తారు.

నానబియ్యం బతుకమ్మ

Studiobharat

తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున 'నానబియ్యం బతుకమ్మ'గా పేర్కొంటారు.ఈ రోజున నావేసిన బియ్యం, పాలు, బెల్లం.. వంటి అమ్మకు ప్రీతిపాత్రమైన పదార్థాలను న్కెవేద్యంగా సమర్పిస్తారు. 

అట్ల బతుకమ్మ

Studiobharat

ఐదో రోజున బతుకమ్మను 'అట్ల బతుకమ్మ' అంటారు.ఈ రోజున అట్లు తయారు చేసి అమ్మకు నివేదిస్తారు. అలాగే బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత మహిళలందరూ ఈ అట్లను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.

అలిగిన బతుకమ్మ

Studiobharat

బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజున అమ్మవారిని 'అలిగిన బతుకమ్మ'గా పిలుస్తారు.చాలాచోట్ల దీన్ని 'అర్రెం'గా కూడా పేర్కొంటారు.ఈ రోజున బతుకమ్మ ఆడరు.అలాగే అమ్మ ఎలాంటి నైవేద్యం కూడా తయారు చేయరు.

వేపకాయల బతుకమ్మ

Studiobharat

ఎంతో ఉత్సాహంగా కొనసాగే బతుకమ్మ ఆటలో ఏడో రోజున అమ్మవారిని 'వేపకాయల బతుకమ్మ'గా అభివర్ణిస్తుంటారు.ఈ రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మకు నివేదన చేస్తారు.

వెన్నముద్దల బతుకమ్మ

Studiobharat

పాట ప్రధానంగా సాగే బతుకమ్మ సంబరాల్లో ఎనిమిదో రోజున అమ్మను 'వెన్నముద్దల బతుకమ్మ'' అని పిలుస్తారు.ఈ రోజున నువ్వులు,వెన్నముద్ద,బెల్లం..వంటి పదార్థాలను పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

సద్దుల బతుకమ్మ

Studiobharat

ఆశ్వయుజ మాసంలో ఎనిమిదో రోజ్మెన దుర్గాష్టమి నాడు బతుకమ్మను 'సద్దుల బతుకమ్మ'గా జరుపుకుంటారు.దీన్ని ' పెద్ద బతుకమ్మ' అని కూడా పిలుస్తారు.ఈ రోజున తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ.. ఇలా రెండు బతుకమ్మలను పేర్చి.. హెూరెత్తే ఉయ్యాల పాటలతో మహిళలంతా ఎంతో వ్యెభవంగా బతుకమ్మ ఆట ఆడుకుంటారు. ఈ రోజున పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడి.. ఇలా ఐదు రకాల సద్దులను అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow