మళ్లీ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ కలకలం
న్యూఢిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి
మళ్లీ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ కలకలం
యాపిల్ నుంచి ఒవైసీ, కేసీ వేణుగోపాల్ లాంటి లీడర్లకు ఈమెయిళ్లు
విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.అదానీని కాపాడడం కోసమే కేంద్రం ట్యాపింగ్ చేస్తోందని,ఆపిల్ నుంచి వచ్చిన ఈమెయిల్స్ ఇందుకు నిదర్శనమన్నారు.ప్రభుత్వంలో నెంబర్ వన్ అదానీ మారిపోయారని మండిపడ్డారు రాహుల్.అదానీ ఆదేశాలను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా పాటిస్తున్నారని ఆరోపించారు.మీ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ఒవైసీ,కేసీ వేణుగోపాల్,మహువా మొయిత్రా,శశిథరూర్,సీతారాం ఏచూరి,రాఘవ్ చడ్డాకు ఆపిల్ నుంచి ఈమెయిల్ వచ్చింది.ఈమెయిల్స్‌ను స్క్రీన్ షాట్లుగా పెట్టి ఎంపీలు ట్వీట్ చేశారు.కేంద్రం తమపై నిఘా పెట్టిందని విపక్ష ఎంపీలు ఆరోపించారు.
పలువురు జర్నలిస్టులకు కూడా మీ ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదముందని
ఆపిల్ నుంచి ఈమెయిల్ వచ్చింది.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.ఆయన తన ప్రసంగాన్ని ఒక కథతో ప్రారంభించి..ప్రస్తుత ప్రభుత్వ అధినేత దాచిన నిజం ప్రతిపక్షాలకు తెలిసిపోయిందని అన్నారు.ఫోన్ హ్యాకింగ్ అంశాన్ని లేవనెత్తిన ఆయన.. విపక్ష నేతల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయన్నారు.కానీ వాళ్లు భయపడరు..ప్రభుత్వం నిఘా పెట్టాలి. తాము హ్యాకింగ్ గురించి పట్టించుకోం.దేశ ప్రజలు ప్రతి సత్యాన్ని అర్థం చేసుకుంటున్నారు.
ట్యాప్ చేసినా కూడా ఎలాంటి తేడా లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఎంతటి నష్టాన్ని చవిచూస్తోందో ఊహించలేం. నేడు తప్పుడు కలలు అమ్మబడుతున్నాయి.ప్రతిపక్షంలో ఉండి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాం. ప్రధాని మోదీ ఆత్మ అదానీలో ఉందని అన్నారు. అధికారం ఎవరి చేతుల్లో ఉంది.వ్యవసాయ రంగం అదానీ చేతుల్లో ఉంది. మౌలిక సదుపాయాలు వారి చేతుల్లో ఉన్నాయి. దేశ ఆస్తులను అమ్మేస్తున్నారు. దేశ యువతకు నష్టం వాటిల్లుతోంది.
‘ప్రభుత్వంలో అదానీ నంబర్ 1’
ప్రభుత్వంలో ప్రధాని మోదీ నంబర్ వన్,అమిత్ షా నంబర్ టూ అని గతంలో చెప్పుకునేవారు.ఇప్పుడు చిత్రం మారిపోయిందంటూ సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ.ప్రభుత్వంలో అదానీ నంబర్ 1,పీఎం మోదీ నంబర్ 2,అమిత్ షా మూడో స్థానంలో ఉన్నారని రాహుల్ అన్నారు.
What's Your Reaction?