ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌ వంతు

న్యూఢిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి

Sep 7, 2023 - 10:42
 0  12
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌ వంతు

ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్‌' వంతు

ఢిల్లీ:

జీ-20 డిన్నర్ మీటింగ్‌ ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పేర్కొనడం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.అయితే.. తాజాగా ప్రధాని మోదీని కూడా 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌' అని పేర్కొన్నారు.ఏసియన్‌-ఇండియా సమ్మిట్‌కు ప్రధాని మోదీ బుధవారం హాజరుకావాల్సి ఉండగా.. ఓ ప్రకటనను విడుదల చేశారు.

ఇందులో భారత ప్రధాని అని పేర్కొనడంతో ఈ వివాదం మరింత ముదిరింది.ఏసియన్-ఇండియా సమ్మిట్', 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా' రెండు పదాలను ఒకే ప్రకటనలో విడుదల చేయడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది.ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంతటి గందరగోళంలో ఉందో ఈ విషయంతో స్పష్టమవుతోందని వెల్లడించింది.ఇండియా పేరుతో ప్రతిపక్షాలు ఏకమవ్వడంతోనే బీజేపీ నాయకులు ఈ డ్రామా క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు...!!_

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow