మంగళవారం రోజున‌‌ లేని శ్రవణ నక్షత్రం - మరి విజయదశమి ఎప్పుడు

స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 22, 2023 - 19:54
 0  51
మంగళవారం రోజున‌‌ లేని శ్రవణ నక్షత్రం - మరి విజయదశమి ఎప్పుడు

విజయదశమి ఎప్పుడు జరుపుకోవాలి..?

మంగళవారం రోజున‌‌ లేని శ్రవణ నక్షత్రం

శమీ పూజకు ప్రధానం శ్రవణా నక్షత్రం

అయోమయం గందరగోళం మధ్య హిందూ సంప్రదాయ పండుగలు ప్రతి సంవత్సరం ప్రజలను తికమక పెడుతున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విజయదశమి ఏ రోజున అనే విషయంలో దోబూచులాడుతుంది. ధర్మశాస్త్ర గ్రంథాలైన *నిర్ణయ సింధు, ధర్మసింధు* ప్రకారము విజయదశమి 23న సోమవారం రోజు జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

అసలు కారణం ఏమిటి?

విజయదశమి పండగ ఏ రోజున అనే విషయమై గందరగోళ పరిస్థితులను తెరదించే ప్రయత్నంలో భాగంగా విజయదశమి పండుగ పై పూర్తి వివరణ ఇది...

విజయదశమి పండుగకు ప్రధానంగా కావలసినది దశమితో కూడిన శ్రవణా నక్షత్రం...

ఈ శ్రవణా నక్షత్రం సమయంలోనే శమీ పూజ జరపవలసి ఉంటుంది. శమీ పూజకు అత్యంత ప్రాధాన్యమైనది. శ్రవణా నక్షత్రం 22వ తారీకు ఆదివారం సాయంత్రం గంటలు 3:35 నిమిషములకు వచ్చి తెల్లవారి సోమవారం 23వ తేదీ సాయంత్రం గంటలు 3:35 నిమిషముల వరకు ఉంటుంది.మంగళవారం నాడు ధనిష్ట నక్షత్రం చొరబడుతుంది.ధనిష్ట నక్షత్రం విజయదశమి పండుగకు విరుద్ధం.

ఈ ప్రకారంగా సోమవారంనాడు అపరాహ్ణ ముహూర్తం లో దశమి పగలు గంటలు 2:29 నిమిషములకు వరకు ఉంది. అపరాహ్ణ కాలము పగలు గంటలు 1:00 నుండి మధ్యాహ్నము గంటలు 3: 28 వరకు ఉంటుంది. ఈ సమయంలో శ్రవణా నక్షత్రముతో దశమి కూడితే అది విజయదశమి అవుతుంది. కనుక దశమి తో శ్రవణ నక్షత్రం కూడినందున తేదీ 23 -10- 2023 సోమవారం రోజు దసరా పండుగ,శమీ పూజ జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

శృంగేరి పీఠంలో కూడా విజయదశమి శమీ పూజ సోమవారము నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు వెల్లడించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు దేవస్థానాలలో 23 వ తారీఖున జరుపుకోవాలని చెబుతున్నారు

తిరుమల తిరుపతి దేవస్థానంలో 23 సోమవారం నాడే విజయదశమి ఆచరించుచున్నారు.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాంగం అనుసరించి విజయవాడ కనకదుర్గ దేవాలయంలో కూడా 23 సోమవారం రోజున దసరా పండగ చేయుచున్నారు.

పంచాంగ కర్తలందరూ కలసి గత మాసంలోనే విజయదశమి 23 సోమవారం జరుపుకోవాలని నిర్ణయించినారు

అందువల్ల 23వ తేది సోమవారం రోజున దసరా పండుగ శమీ జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow