అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ లు షోకేస్ బొమ్మలేనా
అమరావతి స్టూడియో భారత్ ప్రతినిధి
అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ లు షోకేస్ బొమ్మలేనా!
అంగన్వాడీ నిర్వాహణ కోసం టీచర్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్స్ లను అందించడం జరిగింది.సెల్ ఫోన్స్ ఇచ్చినప్పటి నుండి అంగన్వాడీ టీచర్లు యాప్ లు,వాటి వర్క్ అప్ లోడ్ మరియు పలు యాప్ లు రోజు వారీ అప్ డేట్ వెర్షన్ తో సతమతం అవుతున్నారు.ఇప్పటికే ఇటువంటి యాప్ లను ఏర్పాటు చేసినప్పుడు కనీసం వాటి పై అవగాహన కోసం ఎవ్వరికి ట్రైనింగ్ లు లేకపోవడం,అధికారులు మాత్రం గంట గంటకు సామాజిక మాధ్యమాల్లో ఆర్డర్లు పాస్ చేయడంతో అంగన్వాడీ టీచర్లు యాప్ ల వర్క్ తో కుటుంబాలను సైతం పట్టించుకొనే పరిస్థితి లేదని వారి కుటుంబ సభ్యుల వాదనలు వినిపిస్తున్నారు.
ఇటువంటి ఇబ్బందులు నడుమ సతమతమౌతున్న అంగన్వాడీ లకు ఈ మద్య కాలంలో సెల్ ఫోన్స్ అప్ డేట్స్ వెర్షన్ తో వారి ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ లు,ఫొటోలు,అన్ని ప్రభుత్వం నిర్వహించే యండియం మేనేజర్ కి ఫార్వర్డ్ అయ్యాయి.వారి సెల్ ఫోన్స్ అప్ డేట్ వెర్షన్ కాగానే విచిత్రాలను అంగన్వాడీ టీచర్లు చూస్తున్నారు.ఫోన్ చేయడానికి అవకాశం లేదని,ఎవరైనా అంగన్వాడీ పరిధిలో వారు ఫోన్ చేస్తే కాల్ రింగు మాత్రం వినబడుతుందే తప్పా,ఎవరు చేసారో కనబడదు,సెల్ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడానికి అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యతనిస్తుంటే,ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేసే మహిళలైన అంగన్వాడీ టీచర్ల పై ఇంత ఒత్తిడి పెట్టేదెవ్వరనేది అర్థం కాని పరిస్థితులలో అంగన్వాడీ లున్నారు.ఇటువంటి తీరు చూసి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్దిదారులు మాత్రం ప్రభుత్వాన్ని నిందిస్తూ , విసుగు చెందుతున్నారనే చెప్పుకోవచ్చు.
What's Your Reaction?