ముంబై నార్త్ జోన్ డీసీపీ అంబికా జీవితం మహిళా లోకానికి ఆదర్శం

ముంబై స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 20, 2023 - 10:45
Jul 20, 2023 - 11:44
 0  130
ముంబై నార్త్  జోన్ డీసీపీ అంబికా జీవితం మహిళా లోకానికి ఆదర్శం

ముంబై నార్త్ జోన్ డీసీపీ అంబికా జీవితం మహిళా లోకానికి ఆదర్శం 

అంబికా 14 సంవత్సరాల వయసులో తమిళనాడులో ఒక కానిస్టేబుల్ ని వివాహం చేసుకుంది.ఈమె కూడా బాల్య వివాహానికి బలైన వ్యక్తే కానీ ఏనాడు వ్యవస్థ మీద అసహ్యం పెంచుకోలే.ఆమెకు 18 సంవత్సరాలు నిండే సరికి ఇద్దరి ఆడపిల్లల తల్లి.

అంబికా భర్త పోలీస్ IG మరియు DIG పరేడ్ కోసమని ఒక రోజు పొద్దున్నే లేచి వెల్లిపోయాడు.ఆమెకి IG మరియు DIG లకు అధికార లాంచనాలు ఎలావుంటాయో తెలుసుకోవాలని ఆశ కలిగింది.భర్త ఇంటికి తిరిగొచ్చినక వాళ్ళ గురించి అడుగితే వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు రాష్ట్రా పోలీసు డెపార్ట్మెంట్లనే పెద్దవాళ్ళు అని చెప్పేసరికి,నేను కూడా ఆ పదవిలో ఉంటే బాగుండు అని ఆశపడ్డది.

బాల్య వివాహం చేసుకొని పట్టుదలతో డిసిపి అయిన మహిళ 

అంబికా చిన్నప్పుడే పెళ్ళి చేసుకుంది కాబట్టి SSLC కూడా పాస్ కాలేదు కానీ ఆ పదవిని ఎంత కష్టం అయినా సాదించాలనుకుంది. ఆ విషయం తన భర్తకి చెప్పింది,భర్త కూడ సరే నేను సహకరిస్తాను కానీ ముందు నువు SSLC పాస్ కా అన్నాడు.

కష్టపడి నిద్ర హారాలు మాని అటు పిల్లలకి ఇటు భర్తకి సేవ చేస్తూ SSLC,PUC,డిగ్రీ పాస్ అయ్యింది.భర్తని బ్రతిమిలాడి ఒప్పిచ్చి చెన్నైలో IPS కోచింగ్ చేయడానికి భర్త ఏర్పాట్లు చేసాడు.భర్త అన్ని వేళలా తాను ఎదికావలన్న సమకూర్చేవాడు, అలా భర్త సహకారంతో కష్టపడి కోచింగ్ పూర్తిచేసింది.

ఇది కూడా చదవండి...https://studiobharat.com/Where-are-the-main-parties-in-the-state-of-Andhra-Pradesh... దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి..

3 సార్లు పరీక్ష రాసినకాని పాస్ కాలేదు.భర్త కూడా బలవంతంగా ఇంటికి వచ్చేయి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కొన్ని రోజులే ఉంది అన్నాడు.కానీ అంబికా ఇంకా ఒక్క ప్రయత్నం చేస్తాను అప్పుడు కూడా రాకపోతే వచేస్తాను అన్నది,దానికి అతను సరే అన్నాడు.ఒకవేలా పాస్ కాకపొతే కనీసం టీచర్ ఉద్యోగం అయిన చేయొచ్చు అనుకున్నది.

ఫెయిల్ అయిన పట్టుదలతో ముందుకు 

మళ్ళీ కష్టపడి చదివి పరీక్ష రాసి నాలుగోసారికి అన్ని టెస్టులు ఒకటేసారి పాస్ అయ్యింది.2008 పాస్ అయినక ఆమెకి గవర్నమెంట్ ట్రైనింగ్ కి పంపింది.ఇప్పుడామె ముంబై నార్త్ జోన్ డీసీపీ గా పనిచేస్తున్నారు.

అంబికాని చూసి మనం చాలా నేర్చుకోవాలి.ఆమె వవ్యస్తని కానీ,బాల్య వివాహం చేసినందుకు తల్లి తండ్రులను బాద్యులను చేయలేదు.ఒకటి సాధించాలి అని సంకల్పంతో భర్త సహాయంతో ముందుకు పోయి డీసీపీ అయ్యింది...!!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow