అంగన్వాడీ కేంద్రాలను తెరవాలని ప్రభుత్వ ఆదేశాలు
స్టూడియో భారత్ ప్రతినిధి
అంగన్వాడీ కేంద్రాలను తెరవాలని ప్రభుత్వ ఆదేశాలు
చిల్లకల్లు
జగ్గయ్యపేట మండలం ఐసిడిఎస్ చిల్లకల్లు ప్రాజెక్టు పరిధిలో గల సుమారు 265 అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ రెండు రోజుల నుండి మూతపడాయి.వివరాలలోకి వెళ్ళితే రాష్ట్ర వ్యాప్తంగా జీతాల పెంపు,వర్క్ లోడ్,పలు యాప్ ల వల్ల ఇబ్బందులు,పెండింగ్ అద్దెలు,బిల్లులు పలు డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీల యూనియన్ పిలుపు మేరకు అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాలు అంగన్ వాడీ కేంద్రాలకు తాళాలు వేసి మూసివేసి సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు.
దీనితో చిల్లకల్లు ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల నుంచి అందాల్సిన పౌష్టికాహారం కోసం సుమారు 2400 మంది రోజువారీ లబ్ధిదారులు ఫీడింగ్ అందక పేదలు ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికే కేంద్రాల నిర్వహణ సంవత్సరానికి మూడు వందల రోజులు వర్కింగ్ డేస్ ఉండాల్సి ఉండగా అది కాస్త తగ్గే పరిస్థితులు లేకపోలేదని తెలుస్తుంది.సంబందిత యూనియన్ వారు రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా వారి సమస్యలను పరిష్కరించాలని ఇచ్చారని తెలియజేస్తున్నారు.నిన్న ప్రభుత్వం అంగన్వాడీల ప్రధాన సమస్యలను చర్చించి వాటిలో ప్రధానమైనవి ప్రభుత్వం పక్కన పెట్టి కొన్నింటిని పరిష్కరిస్తామని తెలియజేసిన్నట్లు తెలుస్తుంది.
ప్రధాన సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు పట్టుబడటంతో ససేమిరా అంటూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల కు వార్నింగ్ ను సైతం ప్రభుత్వం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇప్పటికైన అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేలా అధికారులు మరింత చర్చలు జరిపి పౌష్టికాహార లబ్దిదారులకు ఫీడింగ్ అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.మెటికల శ్రీనివాసరావు
What's Your Reaction?