ప్రభుత్వం ఏదైనా ఐపిఎస్ ,ఐఏఎస్ లే టార్గెట్
స్పెషల్ స్టూడియో భారత్ ప్రతినిధి
ప్రభుత్వం ఏదైనా ఐపిఎస్ లే టార్గెట్ ....
- తప్పు ఎవరిది గత ప్రభుత్వాన్నిదా...
- లేక అమాత్యులు సంతృప్తి పరచడానికి వీరి అత్యుత్సాహమా...
- ప్రభుత్వాల ఒత్తిడితో ఇబ్బందులు పాలవుతున్న ఇండియన్ పోలీస్ సర్వీస్..
- ఏ ప్రభుత్వం వచ్చినా ఇబ్బందులు తప్పని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు....
ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఉద్యోగాలలో ప్రముఖ పాత్ర పోషించే ఉద్యోగాలు.ఈ రెండు శాఖలు ఒక ఐఏఎస్, ఐపిఎస్ చదవాలంటే కఠోర తపస్సు చేసినను నూటికి ఒక్కరిద్దరికే మాత్రమే అవకాశం లభిస్తుంది.అలాంటి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సంపాదిస్తే,చివరకు ప్రజా ప్రతినిధుల కనుసనల్లో పనిచేస్తూ, వారు చెప్పిన పని చేయకపోతే వారిని బదిలీలు చేసే పరిస్థితి వస్తుంది.ప్రజా ప్రతినిధులు చెప్పిన పని చేస్తే వారు శభాష్ అంటారు.ఇవన్ని పక్కన పెడితే ఒకవేళ ప్రభుత్వం మారితే గతంలో వారి మాట వినని వారిని ప్రక్కన పెట్టే పరిస్థితులు వస్తున్నాయి.ప్రక్కన పెట్టడమే కాకుండా వారినే టార్గెట్ చేసి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.వారిలో ముఖ్యంగా ఇటీవల ఐపీఎస్ అధికారులే ఎక్కువ మంది ఉన్నారు.
వారిలో విశాల్ గున్ని,పివి సునీల్ కుమార్,అన్బు రాజన్ రెడ్డి,మరికొందరు ఇలా దాదాపు చాలామంది ఐపీఎస్ అధికారులను తెలుగుదేశం ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా ప్రతిరోజు సంతకాలు చేయాలని డిజిపి ఆఫీసుకు సరెండర్ చేశారు.కారణమేమంటే గత వైసిపి ప్రభుత్వానికి వీరు విధేయులుగా పనిచేశారనే విమర్శలు వలన,కానీ వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లు చేయకపోతే వీరి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి లాగానే ఉండేది.తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న అధికారులను,వైసిపి ప్రభుత్వం పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా చేశారని ఆలోచన తో తెలుగుదేశం ప్రభుత్వం కొంతమంది ఐపీఎస్ అధికారులను ప్రక్కన పెట్టారు.ఈ ప్రకారంగా సివిల్ సర్వీసులు పోలీస్ సర్వీసులు ప్రస్తుతం రాజకీయ నాయకుల దయాదాక్షిణ్యలతో ఉన్నాయని,వీరి ఉద్యోగాలు కత్తి మీద సాములాగనే ఉన్నాయని,దినదిన గండం లాగానే ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయని అధికారులు ఆవేదన చెందుతున్నట్లు ఉందనే చెప్పుకోవచ్చు.పైగా రెండు ప్రభుత్వాలు కూడా ఐఏఎస్,ఐపిఎస్ అధికారులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం,గతంలోనూ ప్రస్తుతం ఇటువంటివి పరిపాటిగా మారింది.ఈ నేపథ్యంలో ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి చివరకు రాజకీయ నాయకుల వలన అధికారులు అభాసు పాలయ్యే పరిస్థితులు వస్తున్నాయని చాలామంది ఆవేదన చెందుతున్నారు.
పరిపాలన పటిష్టతలో భాగంగా తప్పు చేసిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం సహజమే,కానీ ఈ చర్యలు ప్రతీకార చర్యల లేక అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో భాగంగా చర్యలు తీసుకుంటున్నారా అనే సందేహాలు ప్రజల నుండి వాదనలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికి అత్యంత ఉన్నతమైన విద్యావంతులు అయినటువంటి ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు ఎటువంటి రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనవ్వకుండా,నీతి నిజాయితీగా నిక్కచ్చుగా వారి విధులు వారు నిర్వహిస్తే,ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని తెలిసినా,రాజకీయ నాయకులకు నచ్చకపోతే నామమాత్రపు పోస్టుల్లో ఉద్యోగాలు చేసినా,వారి జీతం వారికి వస్తుందని కానీ కొంతమంది రాజకీయ నాయకులు మెప్పుకోసం ఉన్నతమైన ఉద్యోగాలను పణంగా పెట్టి అతి విధులు నిర్వహిస్తే ఇలా విమర్శలకు బలికావాల్సి వస్తుందని,ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఎటువంటి రాజకీయ నాయకుల మెప్పుల కోసం పనిచేయకుండా, నిజాయితీగా ప్రజల కోసం పని చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రజలు కోరుతున్నారు.అటు ప్రజా ప్రతినిధులు వారికి ఆశలు చూపించి అందలం ఎక్కించి ప్రజా రంజక పాలనకి పాతర పెట్టడం సరికాదని ప్రజా ప్రతినిధులు ఆలోచించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
What's Your Reaction?