అందరికి ఉపయోగపడే ఆహార అలవాట్లు.

హెల్త్ టిప్స్ స్టూడియో భారత్ ప్రతినిధి.

Dec 18, 2023 - 09:26
 0  115
అందరికి ఉపయోగపడే ఆహార అలవాట్లు.

ఆహార అలవాట్లు అందరికి ఉపయోగపడిదని ఆశిస్తున్నాము...

స్టూడియో భారత్ స్పెషల్ 

మానవులమైన మనం స్థానికంగా మన పూర్వీకులు తిన ఆహారాలను మరిచిపోయాము.ప్రస్తుతం ప్రతి ఒక్కరు పాశ్చాత్య ఫుడ్ అలవరుచుకుంటున్న ఈ తరుణంలో రోగాల బారినపడి అవస్థలు పడుతున్నాము.దీనితో ఎక్కని హాస్పిటల్స్ మెట్లు లేవు,రోగాలకు వదిలించుకుంటున్న నగదు మూలానా ఆర్థిక ఇబ్బందులను మనమే కొని తెచ్చుకుంటున్నాము.మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనిషే కాదు,ప్రకృతిలో అన్ని జీవుల శరీరం తన పని చేసుకొని ఎటువంటి వ్యాధులనైన సమర్థవంతంగా ఎదుర్కొనే గుణం ఉంటుందని మనందరికి తెలుసిన ప్రకృతి ధర్మం.కాని ఇవ్వని మరచి మన ఆహారపు అలవాట్లతో రోగాలను కొని తెచ్చుకోవడమే కాకుండా ప్రకృతి ప్రసాదించిన ఆయు ప్రమాణాని తగ్గించుకుంటున్నాము.

మరి ఏమి చేయాలో తెలుసుకుంటారని ఆశిస్తున్నాము..

ఆహార అలవాట్లు ఎలా ఉండాలనేది చూడండి...

  • ఉదయానే నిద్ర లేవగానే పాచి మోహానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని పుక్కిలించి త్రాగాలి.
  • తరువాత కాలకృత్యాలు తీర్చుకోవాలి.
  • అనంతరం ప్రకృతి ప్రసాదించిన వేపా,గానుగ,తంగేడు లాంటి అవుష మొక్కల పులలతో లేక ఆవు పిడకల బూడిద తో దంతాలను శుభ్ర పరుచుకోవాలి.
  • ఎక్సైజ్ లేక యోగ లేక వాకింగ్ చేయాలి.
  • తదుపరి చల్లటి నీటితో స్నానాని చేసి,ఆధ్యాత్మికంగా పూజలు, ప్రార్థన లు చేసుకోవాలి.
  • ఉదయం 8 నుండి 9 గంటల సమయంలో వండిన అన్నం,పచ్చడి, నెయ్యి,కూరలను, మజ్జిగ తో విడివిడిగా కలుపుకోవాలి.మాంస తినేవారు కూడా ఈ సమయంలోనే తిన్నాలి.వండిన ఆహారాన్ని నమ్మిలి లాలజలంతో పాటు మెత్తగా తినాలి.
  • కూరలను ఎలా వండుకోవాలి-శనగ, నువ్వుల,ఆవా నూనెలను గానుగ పట్టించిదే వంటలలలో వాడుకోవాలి.
  • మధ్యాహ్నం ఆహార కాకుండా సీజన్ వారి పండ్లను భుజించాలి...
  • సాయంత్రం 4 నుండి 6 గంటల సమయంలో మరల వండిన ఆహారాని తినాలి.
  • రాత్రి పండుకునే సమయంలో గోరు వెచ్చని పాలు త్రాగాలి.అనంతరం గోరు వెచ్చని నీటిని త్రాగి పండుకోవాలి.
  • టీ కాఫీ అలవాటు ఉన్నవారు బ్లాక్ టీ,లెమన్ టీ లాంటివి త్రాగే అలవాటు చేసుకోవాలి.

ఇది అందరికి తెలిసిన విషయమే మనం రోజు వారీ కార్యక్రమంలో మరచిపోతున్నాము.

ఈ విషయాలను మననం చేసుకోవడమే కాకుండా దినసరి అలవాటు చేసుకొని,పూర్తి ఆరోగ్య వంతులుగా ఉంటారని ఆశిస్తూ నమస్కారములు.మీ సామాజిక కార్యకర్త మరియు ప్రకృతి జీవుడు మెటికల శ్రీనివాసరావు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow