స్మైలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి సంవత్సర వార్షికోత్సవ వేడుకలు

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 22, 2023 - 10:36
 0  91
స్మైలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి సంవత్సర వార్షికోత్సవ వేడుకలు

స్మైలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి సంవత్సర వార్షికోత్సవ వేడుకలు

జగ్గయ్యపేట

జగ్గయ్యపేట పట్టణంలో ఆర్.టి.సి బస్టాండ్ పక్కన గత సంవత్సరం ది:21-12-2022 న స్మైలీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను ఏర్పాటు చేసుకొని సంవత్సరం పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా హాస్పిటల్ లో బెలూన్ లను ఏర్పాటు చేసి వార్షికోత్సవ వేడుకలను చేసుకుంది.ఇప్పటికే ప్రతి రోజు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలను మరియు అంబులెన్స్ సౌకర్యాని అందిస్తుందని మేనేజ్మెంట్ వారు తెలియజేశారు.

జగ్గయ్యపేట ప్రాంత ప్రజలకు విజయవాడ, ఖమ్మం వైద్యం కోసం తరలించడానికి స్వస్తి పలికి కార్పోరేట్ వైద్యాని తక్కువ ధరలకు అందించాలనే ఉద్దేశ్యంతో 50 పడకల స్మైలీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలియజేశారు.ఈ సేవలను సంవత్సర కాలంలో సుమారు 5000 మంది కి వైద్య సేవలను అందించడమే కాకుండా 25 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచిత మందులను సైతం అందించడం జరిగింది.దీనితో పాటు 200 మందికి డాక్టర్ల సూచనల మేరకు ఆపరేషన్ లను సైతం దిగ్విజయంగా పూర్తి చేసుకుని రోగుల ఆదరణ అభిమానాలను చొరకున్నామని మేనేజ్మెంట్ వారు తెలియజేశారు.

ఇప్పటికే ఎముకలు, నరాలు, ప్రసూతి, స్త్రీ, చిన్న పిల్లలు,జనరల్ మెడిసిన్,జనరల్ సర్జన్, ఊపిరితిత్తులు,చెవి,ముక్కు,గొంతు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు.త్వరలో గుండె,చర్మ సంబంధించిన డాక్టరు అందుబాటులోకి వస్తారని తెలియజేశారు.దీనితో పాటు త్వరలో ప్రభుత్వ ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని వారు తెలియజేశారు.ఈ సంవత్సరం కాలంగా స్మైలీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను ఆదరించిన జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంత ప్రజలకు,మీడియా మిత్రులకు,శ్రేయోభిలాషులకు,సహకరిస్తున్న డాక్టర్లు,సిబ్బంది వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు తమ్మారెడ్డి.సందీప్,జి.అవినాష్,వి.వెంకట్ వారు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow