నింగిలోకి రాకెట్ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట స్టూడియో భారత్ ప్రతినిధి

నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్ ప్రయోగం విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగిన ఇస్రో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిని సాధించింది.
ఇస్రో తన వందో ప్రయోగాన్ని బుధవారం ఉదయం ప్రయోగించింది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజు ఉదయం 6-23 గంటలకు GSLV F-15 రాకెట్‌ని ప్రయోగించింది. రెండవ లాంఛ్ ప్యాడ్ నుంచి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది.ఇస్రో అభివృద్ధి చేసిన NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది.భూమికి 36 వేల కి.మీ ఎత్తున GTO ఆర్బిట్‌లో NVS-02 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది.ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఇస్రోకి ఇది వందవ రాకెట్ ప్రయోగం. కాగా డాక్టర్ నారాయణన్ ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక ఇది మొదటి ప్రయోగం. కాగా ఈ ప్రయోగం విజయవంతమైంది.
ఇది ఇస్రోకి ప్రతిష్ఠాత్మకమైమ వందవ ప్రయోగం... ఈ ఏడాది ఆరంభంలోనే నింగిలో రెండు ఉపగ్రహాలని డాకింగ్ ద్వారా రెండు కలిపి ఇస్రో సత్తా చాటింది. ఈ ఏడాది మరో రెండు డాకింగ్ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపనుంది.అతిత్వరలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది.27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం బుధవారం ఉదయం సరిగ్గా 6.23 గంటలకు GSLV F-15 రాకెట్‌ని ప్రయోగించారు.
రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. భూమికి 36 వేల కి.మీ ఎత్తున GTO ఆర్బిట్‌లోకి NVS-02 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది.దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగుల్లో ఆనందం వెల్లివెరిసింది.భారత భూభాగంపై సముద్ర తీరానికి 1500 కి.మీ మేర మెరుగైన నావిగేషన్ సిస్టం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం. అమెరికా తరహాలో జీపిఎస్,వ్యవసాయం,అత్యవసర సేవలు,విమానాల రవాణా,మొబైల్ లొకేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగా GSLV సీరీస్ లో GSLV F-15 రాకెట్ ప్రయోగం 17వది.రాకెట్ పొడవు 5O.9 మీటర్లు. బరువు 420 టన్నులు.ప్రపంచ దేశాలకు మన దేశకీర్తిని ఇస్రో మరోసారి చాటింది.
What's Your Reaction?






