పట్టణ పద్మశాలి కార్తీక మాస వన సమారాధన మహోత్సవం

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 11, 2023 - 15:14
 0  116
పట్టణ పద్మశాలి కార్తీక మాస వన సమారాధన మహోత్సవం

పట్టణ పద్మశాలి కార్తీక మాస వన సమారాధన మహోత్సవం

జగ్గయ్యపేట:  

జగ్గయ్యపేట పట్టణ శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం అద్యక్షులు పెనుమల్లి చంద్రమౌళి,కార్యదర్శి భారత జగన్, ఉపాధ్యక్షులు అల్లి రవి చంద్, కోశాధికారి చెరుపల్లి నాగరాజు ల అధ్వర్యంలో పట్టణంలోని పద్మశాలి కులస్థుల కార్తీక వన సమారాధన మహోత్సవం కార్యక్రమం బలుపాడు రోడ్డులో అనఘా వెంచర్ మామిడి తోటలో జరిగింది.ప్రత్యేకంగా కుల బంధువుల కోసం ఉచిత ఆటోలను కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉదయం 8గంటల నుండి మొట మొదట పాలు పొంగించి,ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేయడం జరిగింది.దీనితో పాటు 30 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాని చేసి స్వామి వారి ఆశ్వీర్వాదం తీసుకోవడం జరిగింది.

అనంతరం దుడకా ఉజ్వలా తో గణపతి స్తుతిస్తూ కూచిపూడి నృత్యంతో ప్రారంభించడం జరిగింది.జబర్దస్త్ టీం వినోదిని పావని లు పద్మశాలీ కార్తీక వన సమారాధన మహోత్సవంలో ఆట,పాటలతో ఉల్లాసవంతమైన కార్యక్రమంలో అలరించడం జరిగింది.ఈ సందర్భంగా కుల బందువులందరు మధ్యాహ్నం సహబంతి భోజనం చేయడం జరిగింది.కార్తీక వన సమారాధన మహోత్సవం కార్యక్రమాని దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్క పద్మశాలీ కులస్థులకు శ్రీ పద్మశాలీ సంక్షేమ సంఘం జగ్గయ్యపేట అధ్యక్షులు పెనుమల్లి చంద్రమౌళి,కార్యదర్శి భారత జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow