అంగన్వాడీ పెండింగ్ అద్దెలను చెల్లించేది ఎప్పుడు 

విజయవాడ స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 5, 2024 - 07:23
 0  65
అంగన్వాడీ పెండింగ్ అద్దెలను చెల్లించేది ఎప్పుడు 

అంగన్వాడీ పెండింగ్ అద్దెలను చెల్లించేది ఎప్పుడు 

విజయవాడ 

ఏపి రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు ఫిబ్రవరి 2024 నెల తరువాత నుండి ప్రభుత్వం అద్దె నగదులను చెల్లించడం లేదని అద్దెకి ఇచ్చిన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతి నెల అద్దెలు చెల్లిస్తామని చెప్పిన అధికారులు మాత్రం సుమారు 7 నెలల దాటుతున్న ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళటం లేదోమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెల నెల అద్దె నగదు వస్తేనే దాని పై ఆధారపడే వారు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారని పలువురు మేధావులు తెలియజేస్తున్నారు.దీనితో పాటు సకాలంలో గ్యాస్,కూరగాయల బిల్లులు కూడా నెలల తరబడి రావడంలేదని పలువురు తెలియజేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకు వెళ్లి వెంటనే అంగన్వాడీ కేంద్రాలకు చెల్లించాల్సిన పెండింగ్ అమ్మౌంట్ ని చెల్లించాలని కోరుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow